Tuesday, June 2, 2026

అసలు అహర్నిశం !


అసలు అహర్నిశం, మాటలు అనర్గళం,

కన్నీటికి కాంతి తోడు, చీకటికి వెలుగు నీడ.


ఆశకి హద్దు వద్దు, బాధకి ఓదార్పు ముద్దు,

గెలుపుకి గమ్యం సాటి, ఓటమి పరుగు దాటి.


తపనకి తపస్సు శ్రేయస్సు, మనసుకి మేధస్సు,

అడుగేస్తే ప్రతి స్వప్నం సాకారం, కాదేది నిరాకారం.


నీవే నీకు నిదర్శనం, నీకుసాటి లేరు ఎవరూ,

నీవే నీకు నీడవు, నీవే నీకు జన్మాంతం తోడవు.


నీవే నీకు మేలవు, నీవే నీకు శత్రువూ,

నీవే నీ జీవనానికి, ఆది అంతం, ఇదే సత్యం.

No comments:

Post a Comment